నల్లగొండ టౌన్, మార్చి 13 : సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకలను సస్పెండ్ చేస్తూ రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.షోయబ్ అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ ను తీవ్రంగా ఖండించారు.
అలిమి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తుందన్నారు. అందుకు జగదీశ్‌రెడ్డి సస్పెన్షనే నిదర్శనం అన్నారు. ఈ పరిణామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. పంటలు ఎండిపోతున్నా, పొలాలకు నీళ్లు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సచిన్, జానకిరామ్ రెడ్డి, రాంబాబు నాయక్, గుర్రాల శ్రీకాంత్, అంజి యాదవ్, శ్రీధర్, అజయ్ పాల్గొన్నారు.