కట్టంగూర్, జూలై 25 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి మొగిలయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైపల్యాలను ప్రజల్లో ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
పార్టీ మండలాధ్యక్షుడు నీలం నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రూపాని లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు మండల వెంకన్న, జిల్లా నాయకులు పులకరం శంకర్, పబ్బు వెంకటేశ్వర్లు, ఓరుగంటి హరిబాబు, కోమటి భాస్కర్, పాదూరి వెంకట్ రెడ్డి, ముడుసు భిక్షపతి, గున్నాల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి బసవోజు వినోద్, బత్తిని నాగరాజు, ఐతగోని శివ పాల్గొన్నారు.