పెన్పహాడ్, అక్టోబర్ 22 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ నెల 25న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ తాసీల్దార్ దరావత్ లాలూ నాయక్ అన్నారు. మేళాకు దరఖాస్తును ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు నేరుగా అక్కడికి వెళ్తే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళా ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నట్లు చెప్పారు. 18 నుండి 40 సంవత్సరాల లోపు వారు దరఖాస్తుకు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అదేరోజు ఉద్యోగ నియామక పత్రం అందిస్తారని తెలిపారు. అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.