దేవరకొండ, డిసెంబర్ 02 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించి సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకొండ మండలం కొండబీమన్పల్లి, నేరేడుగుమ్మ మండలం కాచరాజ్పల్లి గ్రామానికి చెందింన పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో వెంకటయ్య, ఇద్దయ్య, మల్లయ్య, లింగయ్య తదితరులు ఉన్నారు.