కట్టంగూర్, అక్టోబర్ 08 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రహించి ఏ గ్రేడ్ కు రూ.2,389, బీ గ్రేడ్ కు రూ.2,369 మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీటీ రాచకొండ జ్యోతి. కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రకుమార్, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్, క్లస్టర్ ఇన్చార్జి నాగేశ్వరరావు, సెంటర్ ఇన్చార్జి కానుగు సైదమ్మ, సిబ్బంది చెరుకు చంద్రయ్య, సైదులు, యాదగిరి, సరోజ, రైతులు పాల్గొన్నారు.