నల్గొండ రూరల్, జనవరి 20 : బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపుపై కేజీబీవీ ప్రత్యేక అధికారులు దృష్టి సారించి తోడ్పాటు అందించాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి, జిఈసిఓ కత్తుల అరుంధతి అన్నారు. మంగళవారం జాతీయ విద్యా ప్రాణాళిక పరిపాలన సంస్థ, (ఎన్ఐఈపీఏ) మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని కేజీబీవీ ప్రత్యేక అధికారులకు ఐదు రోజుల పాటు జిల్లా విద్యాశాఖ, జెండర్ క్విటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. కేజీబీవీ లోని బాలికలు వారి తల్లిదండ్రుల వద్ద కంటే ఎక్కువ సమయం ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులతోనే గడుపుతారన్నారు. కావునా వారికి ఉత్తమ విద్య, సరైన సౌకర్యాలు, సత్ప్రవర్తన అందించే బాధ్యత కేజీబీవీ ప్రత్యేక అధికారులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీలు వి.శివలీల, టి.పల్లవి, కె.నర్మద, సమత, కేజీబీవీ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Nalgonda Rural : బాలికల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలి : డీఈఓ భిక్షపతి