తుంగతుర్తి, మే 02 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులకు, గ్రామ సర్పంచ్ కి ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నీళ్ల కోసం ఓ మహిళ టాటా ఏస్ వాహనం తీసుకుని బోరు దగ్గర డ్రమ్ములలో నీళ్లు పట్టే ఘటన శనివారం కనిపించింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా నీళ్లు రావడం లేదని, రెండు రోజులకు ఒకసారి తాము టాటా ఏస్ వాహనం ద్వారా నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి మా బాధ ఆలకించి నీళ్లు వచ్చే ఉపాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నట్లు తెలిపారు.