సూర్యాపేట/కేతేపల్లి, మే 14: నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రా జకీయాలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నాడని భవిష్యత్తులో దాడులకు ప్రతి దాడులు తప్పవని, రౌడీ రాజకీయాలను వెంటనే మానుకోవాలని రాష్ట్ర గోట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెం దిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు ఆల్దాస్ సతీశ్గౌడ్పై కాంగ్రెస్ గూండాలు హత్యాయత్నానికి పాల్పడిన సంగతి విదితమే.
సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న సతీశ్‌ను గురువారం దూదిమెట్ల బాలరాజు యాదవ్ పరామర్శించారు. గత 27 నెలలుగా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే దాడులు, జైళ్లలో పెట్టడం, హత్యాయత్నానికి పాల్పడ టం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనమని అడగడం కూడా తప్పేనా.. అని ఆయన ప్రశ్నించారు. వడ్లు కొనమని అడిగితే ఎమ్మెల్యే వీరే శం దాడులు చేయించడం సరి కాదన్నారు. ఎమ్మెల్యే వీరేశం అనుభవిస్తున్న పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అనే విషయం మరువొద్దన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిని విమర్శించే స్థాయి వీరేశానికి లేదన్నారు. బీఆర్ఎస్ వార్డు సభ్యుడిగా గెలవడం, బీఆర్ఎస్ కార్యకర్తగా ఉండడం, వడ్లలో తరుగు ఎం దుకు తీస్తున్నారని ప్రశ్నించడమే సతీశ్ గౌడ్ చేసిన తప్పని, అందుకే కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. నకిరేకల్‌లో పోలీసులు హత్యా రాజకీయాలకు అడ్డుకట్ట వేసి దాడికి పాల్పడిన నిందితులను వెం టనే అరెస్టు చేయాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో జరుగుతున్న రౌడీ రాజకీయాలకు ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే బాధ్యత వహించాలన్నారు.
ఈ విషయమై ఎస్పీ, డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని, ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. సతీశ్‌గౌడ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు, పరుశరాములు, యో గి, సాయి, చీకటిగూడెం బీఆర్ఎస్ నాయకులు నల్లపు లింగయ్య, నల్లపు నాగేశ్వర్రావు, కోడి వెంకటేశ్వర్రావు, సాదే నవీన్, కోట సంపత్‌రావు, బుర్రి నరేశ్, బొజ్జ రామయ్య, వడ్డె జానకి రాములు తదితరులు ఉన్నారు.