మునుగోడు, మార్చి 31 : సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. సోమవారం ఆయన స్వగ్రామం మునుగోడు మండల పరిధిలోని ఎలగలగూడెం వచ్చారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్సీ సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.