రామగిరి, జనవరి 12 : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్ లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి మాట్లాడుతూ.. యువత చైతన్యవంతులై డ్రగ్స్ కు దూరంగా ఉంటూ దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రధానవక్తగా విచ్చేసిన అన్నదాన సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచం మొత్తం విరాజిల్లేలా వివేకానందుని బోధనలు అవసరపడ్డాయని, ఆయన స్ఫూర్తితో దేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా యువతకు ఆటపాటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ్ చాలక్ గార్లపాటి వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రేణిగుంట్ల రాజశేఖర్, పర్యావరణ్ ప్రముఖ్ నన్నూరి రాంరెడ్డి, పిల్లి రామరాజు, గూడూరు శ్రీనివాస్, అంజిరెడ్డి, మాజీ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు, ఇరుగు శ్రీరాములు, నంద్యాల నర్సిరెడ్డి, లతకుమారి, గోపాల్ రెడ్డి, గౌతమి, రమాదేవి, తులసి, మమత, వెంకటరెడ్డి, సంతోష్, విష్ణుమూర్తి, శ్రీనివాస్, వీరేశం, శ్రీనివాస్, మారయ్య, కిషన్, చక్రధర్ పాల్గొన్నారు.

Ramagiri : తపస్ ఆధ్వర్యంలో నల్లగొండలో ఘనంగా వివేకానంద జయంతి