పెన్పహాడ్, జనవరి 02 : వ్యవసాయ మార్కెట్ కమిటీ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని సూర్యాపేట మార్కెట్ కమిటీ చెర్మెన్ కొప్పుల వేణా రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డి.శ్రీనివాసరావు, సర్పంచ్ నన్నెపంగు కమలమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు మాట్లాడుతూ.. పోషకులు పాటించాల్సిన మెళకువలను వివరించారు. పశు పోషకుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం బర్రెలు, దూడలు, గొర్రెలకు అవసరమైన పరీక్షలు చేశారు. తదనంతరం పాడి రైతులకు లివర్ టానిక్, ఖనిజ లవణ మిశ్రమ దాణాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు తూముల సురేష్ రావు, మార్కెట్ డెరైక్టర్లు ఆర్తి కేశయ్య, మీడి మెలపు దామోదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పినేని కోటేశ్వరరావు, మండల పశు వైద్య ధికారి వెంకన్న, రణ్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, సర్పంచులు ఒగ్గు రవి, పవన్, మామిడి శ్రీనివాస్, గజ్జెల సైది రెడ్డి, జానిమియా, మల్గిరెడ్డి సంజీవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇటుకల శ్రీను, గార్లపాటి స్వర్ణ, ముత్తినేని శ్రీనివాస్, పినేని సందీప్ పాల్గొన్నారు.