మిర్యాలగూడ, జూన్ 8: 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణలో సైనిక్ పాఠశాల లేదని మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు. ఆదివారం ఆయన స్థానికంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ తెలంగాణను ముందుకు తీసుకెళ్లేది, అభివృద్ధిపథంలో నిలబెట్టేది విద్య ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో సైనిక్ పాఠశాల ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ సైనిక్ పాఠశాలలో చదివే మన విద్యార్థులను స్థానికులుగా గుర్తించే విధంగా అనుమతిం చాలన్నారు. ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న కోరుకొండ సైనిక్ పాఠశాల కాకుండా మరో మూడు కేటాయిం చారని కానీ ఇప్పటివరకు తెలంగాణకు ఒక్కటి కూడా లేదన్నారు. కేంద్రం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే తెలంగాణాలో సైతం సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.