శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని, ఆయుష్షు పెంచుకోవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శాంతి, సహనాలు శాకాహారంతోనే సాధ్యమని, అన్ని మతాలు బోధించేది అహింసా మార్గమేనని తెలిపారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సూర్యాపేట, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన మెగా శాకాహార ర్యాలీని ఆదివారం ఎంపీ బడుగుల లింగయ్యతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా శాకాహారులు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి శాకాహారం ఎంతో దోహదపడుతుందన్నారు. హింసా చోడో.. హంసా పకడో సిద్ధాంతం భారత దేశాన్ని అహింసాయుత దేశంగా మార్చడానికి బ్రహ్మర్షి పత్రిజీ నేతృత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు.
– సూర్యాపేట టౌన్, జూలై 30
సూర్యాపేట టౌన్, జూలై 30 : శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్రతి ఒక్కరిలో శాంతి, సహనాలకు శాకాహారమే ప్రధాన కారణమని, అన్ని మతాలు బోధించేది అహింసా మార్గమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని జమ్మిగడ్డలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్, సూర్యాపేట పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హింసా చోడో.. హంసా పకడో సిద్ధాంతం దేశాన్ని అహింసాయుతంగా మార్చేందుకు బ్రహ్మర్షి పత్రీజీ నేతృత్వంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదని, సంస్కరణ అని పేర్కొన్నారు. శాకాహారం తీసుకోండి.. ఎక్కువ కాలం జీవించండి అని పిలుపునిచ్చారు. శాకాహారం ఆయుష్షును పెంచుతుందన్న మంత్రి కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయన్నారు. వెజ్‌టేరియన్ ఫుడ్‌తో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఉప్పల ఆనంద్, ట్రస్టు అధ్యక్షుడు కోటగిరి రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు తోట శ్యాంప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మానుపురి దయాసాగర్, తోట సత్యనారాయణ, గుండా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.