‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
సాగునీరు అందక తమ కళ్లేదుటే వరి పంట ఎండిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని.. ఇది ప్రజా ప్రభుత్వం కాదని.. చేవచచ్చిన ప్రభుత్వమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం రైతాంగానికి తక్షణమే సాగునీరు అందించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో కలిసి...
– సాగునీరు అందించలేని చేవ చచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
– ఎత్తిపోతలతో చెరువులు నింపి రైతులను ఆదుకోవాలి
– నడిగూడెం నీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే బొల్లం, బీఆర్ఎస్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నేతృత్వంలో రైతుల నిరసన
కోదాడ, అక్టోబర్ 21 : సాగునీరు అందక తమ కళ్లేదుటే వరి పంట ఎండిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని.. ఇది ప్రజా ప్రభుత్వం కాదని.. చేవచచ్చిన ప్రభుత్వమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం రైతాంగానికి తక్షణమే సాగునీరు అందించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో కలిసి నడిగూడెం మండల కేంద్రంలోని నీటి పారుదల శాఖ ఉప కార్యనిర్వాహక కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఎల్34, ఎల్35, ఎల్36 లిఫ్ట్‌ల ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
అప్పులు చేసి రైతులు పంటలు పండిస్తున్న సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అధికారులు ఇకనైనా స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సాగునీటి సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పంటలు సాగు చేసిన రైతులకు సకాలంలో నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుబాటులో ఉన్న లిఫ్ట్‌లు, ప్రాజెక్టులు, కాలువల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాగునీరు అందించడంలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారన్నారు. నడిగూడెం ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, సాగర్ ప్రాజెక్టు నుండి మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా పాలేరు ప్రాంతానికి తరలించుకుపోయారన్నారు. దీంతో జిల్లా రైతులపై మంత్రి ఉత్తముకున్న ప్రేమ ఏ పాటిదో స్పష్టం అవుతుందన్నారు.

‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
స్థానిక రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా నీటి పంపిణీ చేపట్టడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “మత్తు నిద్రలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొని నడిగూడెం రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్పందించి ఎల్34, ఎల్35 ఎల్36 తదితర లిఫ్ట్‌ల ద్వారా సమృద్ధిగా నీటిని విడుదల చేయాలన్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించి, చెరువులను నింపి, ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. సాగునీటి సమస్యపై ప్రభుత్వం, నీటి పారుదల శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

