తుంగతుర్తి, జనవరి 23 : పేదల అభ్యున్నతి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని వెంపటి, గానుగుబండ గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వెంపటి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి చిర్ర నరేశ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు చిర్ర దిలీప్, బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు పుల్లూరు యాకమల్లు, కూరపాటి సోమేశ్, వంశీ, నరేశ్, గానుగుబండ గ్రామ నుంచి పంజాల యాదగిరి, జలగం ఉపేందర్, సతీశ్, వెంకటేశ్వర్లు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, తునికి సాయిలు, కొండగడుపుల నాగయ్య, అబ్బగాని సత్యనారాయణ, బాషబోయిన వెంకన్న, పులుగుజ్జు యాకయ్య, గాజుల యాదగిరి, గోపగాని శ్రీనివాస్‌గౌడ్, బొంకూరి జలంధర్, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు రచ్చ నవీన్, ఇరుగు మురళి, పుల్లూరు పరుశరాములు పాల్గొన్నారు.