– పీవైఎల్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రవి
కోదాడ, జూలై 17 : దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (PYL) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రవి డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆయనతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించాలన్నారు. భవిష్యత్‌లో పేపర్ లీకేజీలు జరగకుండా పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు.