High Court | పూర్తి వివరాలివ్వండి.. రాయదుర్గం ప్లాట్ల వివాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తలోని సర్వే నంబర్ 83/1లో పీ1, పీ2 ప్లాట్ల వేలం వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- రాయదుర్గం ప్లాట్ల వివాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తలోని సర్వే నంబర్ 83/1లో పీ1, పీ2 ప్లాట్ల వేలం వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్లాట్ల వేలానికి సంబంధించి ఈ నెల 1న టీజీఐఐసీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ సాంకేతిక కమిటీలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. వేలం నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ డాక్టర్ ఎస్ రవీంద్రనాథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ సర్వే నంబర్ 83/1లోని పీ1, పీ2 ప్లాట్లు చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు.
అకడి పురాతన రాళ్లను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతాల పరిరక్షణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, నవంబర్ 8 నాటి సాంకేతిక కమిటీ నివేదిక, జనవరి 27 నాటి అధికారుల కమిటీ నివేదికలకు విరుద్ధంగా వేలం నోటిఫికేషన్ జారీ చేశారని పేరొన్నారు. పురాతన రాళ్లున్న ప్రాంతం పరిరక్షణ పరిధిలో ప్లాట్లు ఉన్నాయా? లేవా? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉన్నదని న్యాయవాది కోరారు. పరిరక్షణ ప్రాంతం వెలుపల ఉంటే సంబంధిత సర్వే వివరాలు, సెచ్, జియోరిఫరెన్స్ తదితర వివరాలను సమర్పించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం వేలం ప్రక్రియపై స్టే విధించేందుకు నిరాకరించింది. ప్రతివాదులు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌తో తాజా పిటిషన్‌ను జత చేస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

