రామగిరి మే 14: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎం సీఏ కోర్సుల్లో ప్రవేశానికి గాను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13,14 తేదీల్లో నిర్వహించిన టీజీ ఐసెట్,-2026 విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో మూడు సెషన్లలో నిర్వహించిన పరీక్షకు 56,206 మం ది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 51146 మంది హాజరయ్యారు. 5,060 మంది గైర్హాజరైనట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఎంజీయూ సీనియర్ ప్రొఫెసర్ అల్వాల రవి వెల్లడించారు. రెం డోరోజు ప్రశ్న పత్రాలను టీఎస్ ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొ.అల్తాప్ హు స్సేన్ విడుదల చేశా రు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 18,711 మందికి 17,056 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెయ్యి 650 మంది గైర్హాజరయ్యారు.
ఈ సందర్భంగా కన్వీనర్ అల్వాల రవి మాట్లాడుతూ..ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పారదర్శకంగా పరీక్ష ముగిసిందన్నారు. తొలిరోజు ప్రశ్నా పత్రాల ఆవిషరణకు వచ్చిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణతో పాటు అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా విజయవంతంగా పరీక్ష నిర్వహించేందుకు తోడ్పాటునందించిన అధికారులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.