ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరలేపింది.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ నెల 11వ తేదీన జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అందులో భాగంగానే ఆలేరు, చౌటుప్పల్, కోదాడ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ భయపెడుతూ, డబ్బుతో లొంగదీసుకుంటూ అనైతిక మార్గంలో గెలిచేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో గుట్టలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి రూ. మూడు కోట్లు ముడుపులిచ్చి నామినేషన్ ఉపసంహరింపజేశారు. అలాగే చౌటుప్పల్‌లోని 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని ఉపసంహరింజేసి, బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ తరఫున బీఫాం అందజేసి ఏకగ్రీవం చేసుకున్నారు. కోదాడలో 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి భయపెట్టి రంగంలో లేకుండా చేశారు. దీనిపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.
చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ బీఫాం
చౌటుప్పల్, ఫిబ్రవరి 3 : చౌటుప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కింది. డైరెక్టు ఎన్నికల్లో గెలిచే దమ్ములేక ఓ బీఆర్ఎస్ అభ్యర్థికి ఎర వేసింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున ఎన్నికల్లో గట్టెక్కడం కష్టంగా భావించిన కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపుతోంది. కాంగ్రెస్ దిగజారుడు తనాన్ని చూసి జనం నెవ్వెరబోతున్నారు. వివరాల్లో వెళ్లితే..మున్సిపల్ ఎన్నికల బీ ఫాం సమర్పణలో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది. 17వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చింతల ఉమామహేశ్వరి బీ ఫాం తీసుకుంది. ఆమె ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పస్తం మల్లమ్మ పోటీలో ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లమ్మను పోటీ నుంచి తప్పించి, చివరి నిమిషంలో ఉమామహేశ్వరికి కాంగ్రెస్ పార్టీ తరఫున బీ ఫాం ఇచ్చి ఏకగీవ్రం చేశారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ పరిణామంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవలేక తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల అధికారులు, పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ కేంద్రంలో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అధికార పార్టీ నాయకులు గుంపులు గుంపులుగా సమావేశమయ్యారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అదే ప్రతిపక్ష పార్టీ నేతలను మాత్రం లోపలికి రాన్వివడం లేదని ఆరోపించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని సమస్య సద్దుమణిగేలా చేశారు.
ఆర్వో, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ బీఫామ్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసిన చౌటుప్పల్ ఆర్వో, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ చౌటుప్పల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 17వ వార్డులో చింతల ఉమామహేశ్వరీ, సాయిలు బీఫామ్ తీసుకోకుండా కాంగ్రెస్‌కు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ వార్డు ఏకగ్రీవమైందని తెలిపారు. సీసీ ఫుటేజీ ద్వారా వివరాలు తెలుసుకొని, విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కలిసినవారిలో బుచ్చిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
దొడ్డిదారిన గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర

కోదాడ, ఫిబ్రవరి 3: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కోదాడలోని కాంగ్రె స్ నేతలు దౌర్జన్యాలకు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులపై వత్తిడి తెచ్చి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమమెత్తారు. మంగళవా రం ఆయన కోదాడ ప్రధాన రహదారిపై ఉన్న గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ఇదేమి రాజ్యం..దోపిడీ రా జ్యం.. కాంగ్రెస్ దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నిక ల్లో దొడ్డిదారిని గెలిచేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.
కాం గ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి 11 వార్డులోని తమ అభ్యర్థి గీతా ప్రసాద్‌పై ఒత్తిడి తెచ్చి నామినేషన్ ఉపసంహరింపజేశారని మండిపడ్డారు. నేరుగా బీఆర్ఎస్తో ఢీకొని ఎన్నికల బరిలో నిలిచే సత్తా లేకనే పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని ఈ దాష్టీకానికి పాల్పడ్డారన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం కూడా చేష్టలుడిగి చూస్తోందన్నారు. ఇప్పటికే ఈ విషయమై రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యా దు చేశామన్నారు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని ఎన్నికలు వాయిదా వేసి నిష్పక్షపాతంగా తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ దంపతులు డబ్బు సంచులతో అక్రమ మార్గంలో ఓటర్లను కొనుగో లు చేసేందుకు యత్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకోబోమని, ఇం దుకు వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 11వార్డులో తమ అభ్యర్థిని బెదిరించడం వల్లే భయబ్రాంతులకు గురై నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారన్నారు. అందుకు నిరసనగా వా ర్డులో ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజలు ప్రధాన రహదారిపై ఆందోళన చేశారన్నారు. ఎన్నిక ప్రక్రియ సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేద ని, వెంటనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలని డిమాండ్ చేశారు. ధర్నా ల్లో నయీమ్, భూపాల్‌రెడ్డి, భాస్కర్, కర్ల సుందర్ బాబు, శ్రీనివాస్, లలి తాభాగ్యమ్మ, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.