ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కేటాయింపుల్లో అక్రమాలకు తెరలేవబోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కేటాయింపుల్లో నిబంధనలకు నీళ్లు వదిలా రు. రేపోమాపో సూర్యాపేట జిల్లాలో ఉ న్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎలిజబులిటీ కోసం ఎంప్యానెల్ టెండర్ ఖరారు కాను న్న సమయంలో అనర్హులకు కట్టబెట్టేందుకే ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు టెండర్లు పిలిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి 37 మంది టెండర్ ఫారాలు కొనుగోలు చేయగా 34 మంది పాల్గొని టెండర్లు దాఖలు చేశారు. అయితే ఇందులో 50శాతం ఫేక్ టర్నోవర్ పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
సూర్యాపేట, జూలై 10 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో ఓ పక్క తప్పులు చేసిన ఉద్యోగులను దం డిస్తున్న ఉన్నతాధికారులే తప్పు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది కాలంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కేటాయింపుల్లో అది స్పష్టంగా కనిపిస్తోందనే వా ర్తలూ ఉన్నాయి. అర్హత ఉన్న ఏజెన్సీలను పక్కన పెడు తూ రాజకీయ నాయకులకు తలొగ్గి, నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని ఏజెన్సీలకు అందలం ఎక్కిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను థర్డ్ పార్టీ కాంట్రాక్ట్(ఔట్ సోర్సింగ్) ఏజెన్సీలకు కేటాయిస్తుంటారు. జిల్లాలో కేటాయింపులు ఎలాంటి పారదర్శకత లేకుండా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఇష్టం ఉంటే అర్హత లేని ఏజెన్సీలను కూడా దొంగదారిన తెచ్చి కేటాయిస్తారు. నిబంధనల మేరకు ఏదైనా శాఖలో ఔట్సోర్సింగ్ ఏజె న్సీ ద్వారా ఉద్యోగాలు కేటాయించాలంటే సదరు ఏజెన్సీకి ఫర్మ్ రిజిస్ట్రేషన్, పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టు లైసెన్స్‌తోపాటు ఆరు నెలలపాటు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించినట్లు రికార్డు ఉండాలి. వీటితో పాటు మూడేండ్లలో ఏదో ఒక ఏడాది రూ.30 లక్షల టర్నోవర్ ఉండాలి. కానీ గతేడాది ఇవన్నీ కలిగిన పలు ఏజెన్సీలకు ఒక్కటి కూడా దక్కకపోగా నిబంధనలు తుంగలోతొక్కి ఇష్టారాజ్యంగా అర్హత లేని వాటికి కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
త్వరలోనే జిల్లాలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎలిజబులిటీ కోసం ఎంప్యానెల్ టెండర్ ఖరారు కానుండగా అర్హులకు కట్టబెట్టేనా.. లేక విచక్షణాధికారాల పేరుతో గతంలో మాదిరి అనర్హులకు అందలం ఎక్కిస్తారో..నంటూ పలువురు ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. ఈసారి కేవలం ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు టెండర్లు పిలవడంపై అక్రమాలు జరుగుతాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమందికి అర్హత లేకపోవడం వల్లనే బయటి ఏజెన్సీలను తీసుకువచ్చి నడిపించుకోవాలనే ఉద్దేశంతో పైరవీ చేసి రెండోసారి టెండర్ వేయించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏజెన్సీలకు అప్పగించడమో లేక పాత వాటిని రెన్యువల్ చేసి కొనసాగించడమో చేస్తారు.. కానీ ఏదీ లేకుండా మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా పని చేయించుకోవడంపై అధికారుల తీరు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈసారి 37 మంది టెండర్ ఫాం కొనుగోలు చేయగా 34 మంది టెండర్ వేశారు. ఇందులో కూడా 50శాతం మంది ఫేక్ టర్నోవర్ పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చివరి మూడేండ్లలో 30 లక్షలకు జీఎస్టీ చెల్లించి ఉండాలనే నిబంధన ఉండగా కొంతమంది సొంత డబ్బు అకౌంట్లో వేసి తీసి టర్నోవర్ సర్టిఫికెట్ పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఏదైనా ఏజెన్సీకి రూ.30 లక్షల టర్నోవర్ లేని పక్షంలో టెండర్ నిబంధనలకు విరుద్ధంగా వారికి బ్యాంకు గ్యారెంటీ తెచ్చుకోమని అధికారులే నోటిమాటగా చెబుతున్నారట. ఈ లెక్కన అంటే గోల్‌మాల్‌కు తెరలేపడమే అవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమంది 10 లక్షలకు బ్యాంకు గ్యారంటీ తెచ్చుకున్నారని వారు రాజకీయ పలుకుబడితో ఎంప్యానెల్‌లో చేరేందుకు పైరవీలు కొనసాగిస్తున్నారని సమాచారం. గతేడాది కూడా అన్ని అర్హతలు ఉన్న వారిని పక్కన పెట్టి అనర్హులకు కట్టబెట్టడంతో దీనిపై కోర్టుకు వెళ్లడం… కోర్టు నంచి ఆర్డర్ తెచ్చుకున్నా అమలు చేయకపోవడంతో కలెక్టర్‌పై కోర్టు ధిక్కారణ నేరం మోపడంతో గత్యంతరం లేక పాత ఏజెన్సీలకు ఇస్తూ కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సి వచ్చింది. జిల్లాలో ఇప్పటికీ అర్హత లేని అనేక ఏజెన్సీలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయని, ఈ సారైనా అధికారులు అన్ని అర్హతలున్న ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.