శాలిగౌరారం, అక్టోబర్ 27 : నియోజకవర్గంలో పదేండ్ల తన పదవి కాలంలో పంచాయితీలు, కొట్లాటలకు తావు లేకుండా కేవలం అభివృద్ధ్దికి మాత్రమే అధిక ప్రాధాన్యతనిచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఎనలేని అభివృద్ధ్ది చేశాను, మరోసారి ఆశీర్వదిస్తే రెట్టింపు అభివృద్ధ్ది చేసి చూపిస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.
శుక్రవారం మండలంలోని బైరవునిబండ, తక్కెళ్లపహాడ్, ఎన్జీ కొత్తపెల్లి, రామాంజపురం, ఉప్పలంచ, మనిమద్దె, గురజాల గ్రామాల్లో మండల స్థాయి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మూడోసారి తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి సీఎం కేసీఆర్ మరో అవకాశం కల్పించారని, మీ అందరి ఆశీర్వాదం తనపై ఉండాలని ప్రజలను అభ్యర్థించారు.
ముందుగా ఎమ్మెల్యే కిశోర్ కుమార్ బైరవునిబండ గంగా భవాని ఉమామహేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి తన ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్రజలు అడుగడుగనా అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు మంగళాహారతులు, కోలాట బృందాలచే స్వాగతం పలుకగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు మద్దతు పలికారు.
రాత్రి వరకు ప్రచారం జోరుగా సాగింది. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, వైస్ ఎంపీపీ కందుల అనిత, చాడ హతీశ్రెడ్డి, గుండా శ్రీనివాస్, కట్టా వెంకట్‌రెడ్డి, తాళ్లూరి మురళి, మామిడి సర్వయ్య, కంబాలపల్లి కృష్ణ, నూక కిరణ్‌కుమార్ యాదవ్, గంట శంకర్, జెర్రిపోతుల చంద్రమౌళి గౌడ్, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కల్లూరి నాగరాజుగౌడ్, జటంగి శంకర్, కొత్త శంకర్‌రెడ్డి, శేఖర్‌బాబు, ఏమిరెడ్డి నర్సిరెడ్డి, కొన్రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బండారు మల్లయ్య, వేల్పుల నరేందర్, భూపతి ఉపేందర్‌గౌడ్ పాల్గొన్నారు.