అర్వపల్లి, ఏప్రిల్ 21 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామంలో సోమవారం ACF టీబీ యాక్టివ్ కేసు నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 20 మందికి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భూక్యా నగేశ్ మాట్లాడుతూ.. ఎవరికైనా టీబీ లక్షణాలు ఉన్నట్లయితే సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా తగ్గిపోతుందని తెలిపారు. క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి 2025 చివరి నాటికి భారత దేశం నుండి టీబీని పూర్తిగా నిర్మూలించాలని కోరారు.
ఏ వయస్సు వారికైనా క్షయ లక్షణాలు ఉన్నట్లయితే ఆశ కార్యకర్తలను, అరోగ్య సిబ్బందిని సంప్రదించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు అలాగే 60 ఏండ్లు పైబడిన అందరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్దారణ అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో అందించే మందులను వాడి తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ లలిత, టీబీ నోడల్ పర్సన్ వీరయ్య, ల్యాబ్ టెక్నీషియన్ చొక్కయ్య, M.L.H.P గౌతమి, హెల్త్ అసిస్టెంట్ నాగరాణి, శ్వేత, ఆశ కార్యకర్తలు అన్నపూర్ణ, సుజాత పాల్గొన్నారు.