ఆర్టీసీకి దసరా ధమాకా
ఆర్టీసీకి దసరా పండుగ కలిసి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం గత నెల 24, 25 తేదీల్లో, 30 నుంచి ఈనెల 4 వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. నల్లగొండ రీజియన్ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్పల్లి, సూర్యాపేట, యాదగిరిగుట్ట, కోదాడ డిపోల ద్వారా అధికారులు 374 ప్రత్యేక సర్వీసులను నడిపించారు
- ఏడు రోజుల్లో ఏడున్నర కోట్ల ఆదాయం
- ఉమ్మడి జిల్లాలో నడిచిన 374 ప్రత్యేక సర్వీసులు
నల్లగొండ సిటీ, అక్టోబర్ 7: ఆర్టీసీకి దసరా పండుగ కలిసి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం గత నెల 24, 25 తేదీల్లో, 30 నుంచి ఈనెల 4 వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. నల్లగొండ రీజియన్ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్పల్లి, సూర్యాపేట, యాదగిరిగుట్ట, కోదాడ డిపోల ద్వారా అధికారులు 374 ప్రత్యేక సర్వీసులను నడిపించారు. కాగా ఆయా డిపోల పరిధిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు అప్పటికప్పుడే అదనంగా మరో 20 బస్సులను నడిపామని రూ 7.42 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు .
నష్టాల నుంచి లాభాల బాట పట్టేందుకు ఆర్టీసీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనతో ముందుకు వెళ్తున్నది. గతంలో పండుగ సమయాల్లో అధిక చార్జీలు వసూలు చేసే ఆర్టీసీ ఇప్పుడు ప్రయాణికులను ఆకర్షించేందుకు పాత చార్జీలనే అమలు చేస్తూ ప్రయాణికులు ఆదరిస్తున్నారు. గత నెల 24న రూ.కోటి 17 లక్షలు, 25న 89 లక్షలు, 30న రూ.కోటి, ఈనెల 1న రూ. కోటి14లక్షలు, 2న రూ. కోటి10 లక్షలు, 3న రూ.కోటి 11 లక్షలు, 4న రూ.కోటి 6 లక్షలు సమకూరినట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 7,8,9 తేదీల్లో కూడా ఆదాయం పెరగనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- dasara
- Huge profits
- Nalgonda
- season
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

