రామగిరి/యాదగిరి గుట్ట, మే 24 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 పరీక్ష ఫలితాలను తెలంగాణ సాంకేతిక విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామానికి చెందిన గౌరుగంటి శ్రీజ రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించింది. ఉమ్మడి జిల్లాలో పదిలోపు రెండు, 20లోపు ఒకటి, 100లోపు ఆరు ర్యాంకులు సాధించారు. నల్లగొండ జిల్లాలో 4,766 మంది పరీక్షకు హాజరుకాగా 3,935మంది, సూర్యాపేట జిల్లాలో 2,911 మందికి 2,432మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,664 మందికి 1,347మంది ఉత్తీర్ణత సాధించారు.
గంజి హర్ష సిద్ధార్థ(శివాజీనగర్, నల్లగొండ) -14
గంజి వాగ్ధేవి, (నల్లగొండ)-51
శ్రీలం కార్తీక (బొర్రాయిపాలెం, అన్నారం)-53
పెరుమాళ్ల సాయి సాహితీ(మంగళపల్లి, నకిరేకల్)-59
చెర్వుపల్లి చర్వితమణి ( మిర్యాలగూడ)- 129
గౌరుగంటి శ్రీజ (మిర్యాల)-1
షేక్ ఇర్ఫా తహసీం(భవానీనగర్, కోదాడ)-5
బుర్యా పావని (శ్రీరాంనగర్, సూర్యాపేట) -9
గొట్టిపాముల సాయిమేఘన (రఘునాథ్పురం)-24
గుడిగ దీపిక -60
తోటకూర వైష్ణవి (రాంనగర్, భువనగిరి)-75
సారబాబు సాయి నీరజ్, (గంజ్, భువనగిరి)- 222