నల్లగొండ : పార్టీ కోసం పని చేసే వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త మిడిదొడ్డి కొండల్ ఇటీవల మృతి చెందాడు.
కొండల్ టీఆర్ఎస్ ప్రమాద బీమా సభ్యత్వం పొందడంతో బీమా పథకం కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యేమృతుడి తండ్రి మిడిదొడ్డి జంగయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం లో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణ,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఉజ్జిని సాగర్ రావు, ప్రసాద్, జంగయ్య, సుమతి రెడ్డి, బోడ్డుపల్లి కృష్ణ, మురళి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.