
వేములపల్లి : బీజేపీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలను, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అద్బుత సాధనాలుగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైయివేటీకరణ చేస్తాననడం దేశ ప్రజలను మోసగించడమేనని అన్నారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హమీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ హమీని తుంగలో తొక్కి యువతను మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనేదాక టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసిఆర్ నేతృత్వంలో ఉద్యమాలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఏసిఎస్ మాజీ చైర్మన్ రాజగోపాల్రావు, పెదపంగ సైదులు, నగేష్, శంబులింగం, పకీరయ్య పాల్గొన్నారు.