త్రిపురారం, మే 11: ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు మేలు జరుగాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ కోరారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మజ్జిగ వెంకట్‌రెడ్డి, నాయకులు బైరం కృష్ణ, జంగిలి శ్రీనివాస్, అనుముల సుధాకర్‌రెడ్డి, దస్తగిరి, అనుముల శ్యాంసుందర్‌రెడ్డి, సయ్యద్, పడిశల శేఖర్, నాగుల్‌మీరా, చింతకాయల యాద య్య, శ్రీనివాస్, విజయ్, నాగయ్య, గోవర్ధన్, ఆంజనేయులు, చంద్రమ్మ పాల్గొన్నారు.
నల్లగొండ, మే 11: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పిలుపు నిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని 3,18,19 వార్డుల్లోని పలు కాలనీల్లో కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ మహిళా మాజీ జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, పట్టణ నాయకులు కొంగరి సైదులు, నిమ్మనగోటి శ్రీనివాసు, మేడి నర్సింహ, కట్లకుట్ల పెద్దులు, పేర్ల అశోక్, ముశం దశరథ, యాదగిరి పాల్గొన్నారు. పట్టణంలోని 41వ వార్డులో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రమాదేవి ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహింపేట గ్రామంలో , తిరుమలగిరి(సాగర్)లో పార్టీ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలం మొల్కచర్ల గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుడు పాతులోతు రామకోటి ఆధ్వర్యంలో, కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేపట్టారు. మిర్యాలగూడలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు నల్లమోతు సిద్దార్థ ఇంటింటి ప్రచారం చేపట్టారు.