చౌటుప్పల్‌రూరల్, అక్టోబర్ 13 : దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచే వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఆదివారం పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద, చౌటుప్పల్ పట్టణంలో వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్ సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.