చండూరు, ఫిబ్రవరి 02 : చండూరు మండలంలోని ధోనిపాముల గ్రామానికి చెందిన పడసనబోయిన యాదయ్య (గణి) తండ్రి మాసయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం ఒకవైపు, కుటుంబంలో ఆరోగ్య సమస్యల కారణాల వల్ల ఆర్ధిక సమస్యలు ఎదురవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్నటీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్రామ్ రెడ్డి (టామన్న) ఫౌండేషన్ సభ్యుడు ఆస్కాని శ్రీను ద్వారా యాదయ్య కుటుంబానికి సోమవారం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పడసనబోయిన శ్రీను, వట్టి శ్రీకాంత్, పులకరం కళ్యాణ్, వట్టి శ్రీకాంత్ పాల్గొన్నారు.