రామగిరి, జూన్ 20: మనసును నియంత్రణలో ఉంచి, శరీర ధృడత్వం, మానసిక ప్రశాంతతను చేకూర్చేది యోగాభ్యాసం అం దం..ఆనందం…ఆరోగ్యం ..అన్నింటికీ మూ లం యోగానే. ఉరుకుల పరుగుల జీవితంలో రకరకాల ఒత్తిళ్లు, ఉద్యోగం, చదువులతో యువత తీవ్ర మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటి నుంచి ఉపశమ నం పొందే ఏకైక మార్గం, అధ్భుతమైన జీవన ప్రక్రియ యోగా. వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన యోగా విద్య నేడు అంతర్జాతీయ వేడుకైంది.
ప్రపంచనికి యోగాను అందించింది మన దేశమే కావడం గమనా ర్హం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సం దర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థ్ధల్లో, పలు సంస్థల ఆధ్వర్యంలో యోగా దినంగా పాటించనున్నారు. ప్రాచీన కాలంలో యోగులు, బుషులు దీర్ఘకాలం జీ విస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవలంబించిన పద్ధతే నేటి యోగా. యోగా క్రీ.పూ 6000 ఏండ్లకు పూర్వమే ఉన్నట్లు చరిత్ర సాక్ష్యాలు చెబుతున్నాయి.
ఉపనిషత్తుల్లోనూ యోగా విద్య గురించి ప్రస్తావన ఉంది. యో గాకు ఆద్యుడు ఎవరనే విషయం ఇంతవర కు కచ్చితంగా తెలియదు కాని, ప్రపంచానికి యోగా విద్యను పరిచయం చేసింది మాత్రం ‘పతంజలి మహర్షి’ ఆయననే యోగా విద్య కు ఆద్యునిగా పిలుస్తారు. 2015లో ప్రపంచంలోని 174 దేశాలు యోగా దినోత్సవాన్ని పాటించగా 2025లో 256 దేశాలు భాగస్వామ్యమైనవి. వీటిలో 55 ముస్లిం దేశాలు కూడా ఉండటం గమనార్హం.