రామగిరి, జూన్ 30 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు బంద్ చేయనున్నారు. గంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 188 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 53,213 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షలకు జిల్లా యంత్రా ంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 53, 213మంది అభ్యర్థులు హాజరుకానుండగా వీరికి కోసం జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలో 188 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కా పరీక్ష నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాల గేట్లు మూసి వేయనున్నారు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది.
గ్రూప్-4 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రత్యేక రూట్స్‌గా విభజన చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ సాగుతుంది. గ్రూప్ -4 పరీక్షలకు 53, 123 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరికోసం 188 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్షల నిర్వహణ సమయం ఇలా
గ్రూప్ -4 పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఉం టుంది. పేపర్ -1(జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటిఎస్) మధ్యా హ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పరీక్ష హాల్లోకి వచ్చిన తర్వాత ఇన్విజిలేటర్ అభ్యర్థి గుర్తింపుకార్డు (ఆధార్‌కార్డు, ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు) చూపించాలి. పరీక్షల కేంద్ర వద్ద వైద్య సిబ్బందితోపాటు అవసరమైన ప్రథమ చికిత్స మందులు అందుబాటులో ఉంచుతున్నారు.
అభ్యర్థులు ఇవి తీసుకువెళ్లొద్దు
అభ్యర్థుల వెంట ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులు తీసుకునిరావొద్దు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలి. షూ వేసుకుని వస్తే పరీక్ష కేంద్రం వెలుపలనే వదిలివేయాలి.
కట్టంగూర్‌లో రెండు కేంద్రాల ఏర్పాటు
కట్టంగూర్ : గ్రూప్-4 పరీక్షలకు కట్టంగూర్ మండల కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో 216 మంది, సాందీపని పాఠశాలలో 264 మంది మొత్తం 480 మంది పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా వసతులు ఏర్పాటు చేసినట్లు పాఠశాలల చీఫ్ సూపరింటెండెంట్ ఆర్.జ్యోతి, పోగుల రాములు తెలిపారు.
మునుగోడులో ఆరు కేంద్రాలు
మునుగోడు : గ్రూప్ -4 పరీక్ష కోసం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాలను జిల్లా మైనార్టీ అధికారి బాలకృష్ణ, డిప్యూటీ తాసీల్దార్ నేలపట్ల నరేశ్‌తో కలిసి మౌలిక వసతలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో 1,728 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు అధికారులు చెప్పారు.