కట్టంగూర్, మార్చి 18 : నల్లగొండ జిల్లా కట్టంగూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి జీవితంలో అభివృద్ధి సాధించాలంటే చదువు ఒక్కటే మార్గమని, కష్టంతో ఇష్టపడి చదివిన వారు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారన్నారు. ఉన్నత చదువులు చదవడానికి పదో తరగతి కీలకమని విద్యార్థులు పట్టుదలతో పరీక్షలు రాసి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, కుటుంబ సభ్యులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలో తమ జ్ఞాపకాలను ఉపన్యాసాల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహాలక్ష్మి, ఆంథోని, సునంద, విఠల్ కుమార్, గపూర్ పాల్గొన్నారు.
Kattangur : చదువుతో జీవితంలో ఉన్నత స్థానాలకు : ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య