ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా..
తిరుమలగిరి ము న్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన సంకేపల్లి రఘునందన్‌రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మెచ్చిన నాయకుడిగా గుర్తింపు సాధించారు.
- మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..
- నమస్తే తెలంగాణతో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి
తిరుమలగిరి ఫిబ్రవరి 18: తిరుమలగిరి ము న్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన సంకేపల్లి రఘునందన్‌రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మెచ్చిన నాయకుడిగా గుర్తింపు సాధించారు. 2020లో మొదటి సారిగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులకు గానూ బీఆర్ఎస్ 11 స్థానాలు సాధించింది. దీంతో ఆయన వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
2026 మున్సిపల్ ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి బీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సహకారంతో ఆయన తిరుమలగిరి మున్సిపల్ పీఠం అధిష్టించారు. ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు.
నమస్తే : మున్సిపల్ చైర్మన్‌గా మీ విజయాన్నిఎలా భావిస్తున్నారు ?
రఘునందన్ : ఇది ప్రజా విజయం. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు నాపై ఉన్న నమ్మకంతో గెలిపించారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా మన్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతా. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా.
నమస్తే : మీ రాజకీయ జీవితంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఓ మైలు రాయిగా భావించవచ్చా ?
రఘునందన్ : రాజకీయ జీవితంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఒక మైలు రాయిగానే భావిస్తున్నా.40 సంవత్సరాల రాజకీయంలో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా. మచ్చలేని నాయకుడిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కృషి వల్లే ఈరోజు మున్సిపల్ పీఠంపై కూర్చున్నా.
నమస్తే : మున్సిపాలిటీ అభివృద్ధికి ఎలా కృషి చేస్తారు ?
రఘునందన్‌రెడ్డి : మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. రాజకీయాలకు అతీతంగా పనిచేసి, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృషి సారిస్తా.
నమస్తే : కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రెండో సారి కూడా మున్సిపల్ ప్రజలు అదే జోష్‌తో బీఆర్ఎస్ను గెలిపించేందుకు గల కారణం ?
రఘనందన్‌రెడ్డి : కాంగ్రెస్ వాగ్ధానాలపై ప్రజలకు నమ్మకం పోయింది. అందుకే ఓటర్లు రెండోసారి కూడా బీఆర్ఎస్ను గెలిపించారు. 2020లో మొదటగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలక వర్గం ఏర్పడింది. నాకు వైస్ చెర్మన్‌గా అవకాశం లభించింది. మంత్రిగా జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేగా గాదరి కిశోర్‌కుమార్ దండిగా నిధులు తెచ్చి మున్సిపాలిటీలో ప్రగతి పరుగులు పెట్టించారు. టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ. 20కోట్లు నిధులు మం జూరు చేయించి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దారు. రూ. 5 కోట్లతో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణం, రూ.3 కోట్లతో మల్టీపర్పస్ ఆడిటోరియం, రూ .2 కోట్లతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, రూ.కోటితో డ్రైనేజీ కాల్వల నిర్మాణం, తెలంగాణ చౌరస్తా లో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాం. సీసీ రోడ్లు , ఇంకా అ నే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. అందుకే ప్రజలు రెండోసారి కూడామున్సిపాలిటీలో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు.
నమస్తే : స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడిగా మీకు పేరు ఉంది నిజమేనా ?
రఘునందన్‌రెడ్డి : నేను పుట్టి పెరిగింది తిరుమలగిరిలోనే. నా జీవితం తెరచిన పుస్తకం. ఈ సారి ప్రజలు నాపై మరింత బాధ్యత పెట్టారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగానే పనిచేస్తా. నా జీవితం..ప్రజా సేవకే అంకితం.మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

