మర్రిగూడ, నవంబర్ 26 : పూటకో పార్టీ గంటకో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి, నర్సింహాపురం, అజిలాపురం, యరగండ్లపల్లి, రాంరెడ్డిపల్లి, తానేదార్పల్లి, శివన్నగూడెం, ఖుదాభక్ష్‌పల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన మరుక్షణమే మునుగోడుకు పట్టిన దరిద్రం వదిలిందన్నారు.
తన ఓటు తాను కూడా వేసుకోలేని వ్యక్తికి మనము ఓటెయ్యాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికలొచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు.ఆయన పాలనలోనే తెలంగాణ రాష్ట్రం క్షేమంగా ఉంటుందన్నారు. కారు గుర్తుపై ఓటేసి మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే మునుగోడును మరింత అభివృద్ధ్ది చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలను పూర్తిగా కలుషితం చేశాడని అన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు,ప్రజలు ఘన స్వాగతం పలికారు.కోలాటం,బోనాలు,బతుకమ్మలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణ రావు,మునగాల వెంకటేశ్వర్ రావు,కాకులవరం లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీపీ అన ంత రాజు గౌడ్, సర్పంచులు ఆంబోతు సుధాకర్ నాయక్, మాడెం శాంతమ్మావెంకటయ్య, ఎంపీటీసీలు గండికోట రాజమణీహరికృష్ణ,దంటు జ్యోతి, దాసరి మమతాగోపాల్, లపంగి నర్సింహ,బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్ పాల్గొన్నారు.
గట్టుప్పల్: సొంత లబ్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి తాను రాజీనామా చేస్తూనే నియో జకవర్గానికి నిధులు వచ్చాయనడం సిగ్గు చేటని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోయి..గోసపడుద్దని.. బీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని అంతంపేట గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలు ఆయనకు ర్యాలీతో బోనాలు, డప్పు చప్పుళ్లు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఆలోచించి సరైన సమయంలో సరైనా నిర్ణయం తీసుకోవాలన్నారు.
గట్టుప్పల్ మండల వాసుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మునుగోడులో అభివృద్ధి కుంట పడుతున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయా స్రవంతి మర్రిగూడ ఎంపీపీ మోండు మోహన్ రెడ్డి, సర్పంచ్ మాదగోని శేఖర్, ఎంపీటీసీ నేనావత్ బంతిలాల్, బీఆర్ఎస్ మర్రిగూడ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఐతరాజు హనుమంతు, వీరమళ్ల రాజు, సురిగి సందీప్, ఐతరాజు స్వామి, లింగయ్య, నర్సింహ, మల్లేశ్ పాల్గొన్నారు.