నీలగిరి, డిసెంబర్ 30 : బైక్ను టిప్పర్ లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల గాంధీ న్యూరో ఆస్పత్రి వద్ద మంగళవారం జరిగింది. పల్సర్ బైక్పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ లోడ్ వాహనం వెనుక నుండి ఢీకొంది. దీంతో బైకర్ టిప్పర్ వెనుక టైర్ల కిందపడడంతో తల నుజునుజ్జు అయి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.