నిడమనూరు, జనవరి 5 : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ముగ్గురు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలికల విభాగంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు షేక్ ఆయేషా, నాదెండ్ల కీర్తి జైపూర్లో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పోటీల్లో పాల్గొంటుండగా, ఆయేషా జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.
అలాగే మండల కేంద్రానికి చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థి మల్లికంటి గణేశ్ బాలుర విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 7 నుంచి 11 వరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడనున్నాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆదర్శ విద్యార్థినులను ప్రిన్సిపాల్ రంజిత, ఫిజికల్ డైరెక్టర్ గిరి వరప్రసాద్ అభినందించారు.