కట్టంగూర్, నవంబర్ 7 : ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా కమిటీలో కట్టంగూర్ మండలానికి చెందిన ముగ్గురు ఆశ వర్కర్లకు చోటు లభించింది. ఈ నెల 6న నల్లగొండలో దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా 5వ మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా తనిటి వెంకటమ్మ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా చెరుకు జానకి, జిల్లా కమిటీ సభ్యురాలిగా భూపతి రేణుక ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసి పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ మండల అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి, ఆశ వర్కర్లు బొజ్జ సైదమ్మ, సాతీరు రేణుక, చిత్రం పద్మ, పింజర్ల అనిత, గండమల్ల సంధ్య, దాసరి సుజాత, గద్దపాటి భారతి, సుజాత పాల్గొన్నారు.