రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి
రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో మంగళవారం జరిగింది. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయ్ రావు (43), ఉప్పుతల నరసింహారావు (38) ఇరువురు బైక్‌పై డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్తుండగా..
దామరచర్ల, జూన్ 09 : రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో మంగళవారం జరిగింది. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయ్ రావు (43), ఉప్పుతల నరసింహారావు (38) ఇరువురు బైక్‌పై డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్తుండగా లారీ యార్డు వద్ద దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వెంకటేష్ (25) మోటార్ సైకిల్ పై ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో ధనుంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వెంకటేష్ సైతం మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం నరసింహారావును నల్లగొండ తరలిస్తుండగా అతను సైతం మార్గమధ్యంలో మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించడంతో మండలంలో ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. సమాచారం అందుకున్న వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

