సూర్యాపేటటౌన్, అక్టోబర్ 7: కోదాడలో రూ. 60 లక్షల విలువచేసే గంజాయిని సీజ్ చేసి ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను పట్టణ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈమేరకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 23న కోదాడ పరిధిలోని హైవే వెంట సుమారు 110 కిలోల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.
దీనిని గుర్తించిన కోదాడ పట్టణ పోలీసులు స్వాధీ నం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా సోమవారం కోదాడ పోలీసులు హైవేపై ఉన్న కట్టకొమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించి పారిపోతున్న కారును వెంబడించి పట్టుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన కణం రమేశ్ వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచ ర్లు చాపల అశోక్, చాపల ఎరకమ్మను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేయ గా పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. నేరస్తుడు కణం రమేశ్ నిత్యాన్నదానాలు చేసే ఆశ్రమాలకు బియ్యం సరఫరా చేసేవాడు. వ్యాపారంలో నష్టం రావడం తో మిల్లర్లకు డబ్బు చెల్లించలేక మానసిక ప్రశాంతత కోసం ఓం శాంతి బ్రహ్మకుమారి ఆశ్రమానికి చేరుకున్నాడు.
అక్కడ ఆయనకు విజయనగరం జిల్లాకు చెందిన చాపల ఎరుకమ్మ పరిచయం కావడంతో ఇద్దరూ కలసి రెండేండ్లుగా విజయవాడలో బియ్యం వ్యాపారం చేశారు. ఈ వ్యాపారంలోనూ నష్టం రావడంతో గంజాయి వ్యాపారం చేస్తే డబ్బు బాగా వస్తుందని, అప్పులు తీరుతాయని ఎరుకమ్మకు చెప్పి తనకు తెలిసిన అశోక్‌తో కలసి ముఠాగా ఏర్పడ్డారు. అశోక్ ఒడిశా వెళ్లి కేజీ రూ. 5వేల చొప్పున 110 కిలోల గంజాయిని కొనుగోలు చేసి బస్తాల్లో ప్యాక్ చేసుకొని గతనెల 22వ తేదీ రాత్రి విజయవాడలోని ఎరుకమ్మ గదికి తీసుకొచ్చాడు.
రమేశ్ ఆ గంజాయిని కారులో వేసుకొని గతనెల 23వ తేదీ తెల్లవారు జామున విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నాడు. కాగా కోదాడ శివారులో రోడ్డుపై పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా గమనించి తిరిగి కొద్ది దూరం విజయవాడ వైపు వెళ్లారు. అక్కడ హైదరాబాద్ వైపు, సర్వీసు రోడ్డు పక్కనే ఉన్న భారత్ పెట్రో ల్ బంక్ పక్కనే ఉన్న ఓ షెడ్డులో 110 కిలోల గంజాయిని పడేసి విజయవాడ పారిపోయాడు.
వారి పథకం విఫలం కావడంతో కొన్ని రోజులు వేచి చూసి ఈనెల 6వ తేదీ ఉదయం గంజాయిని తన కారులో వేసుకొని అమ్మేందుకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కోదాడ శివారులో కట్టకొమ్ముగూడెం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారును వేగంగా నడుపుతూ పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు.
అతడి వద్ద నుంచి 10 కిలోల గం జాయి, 8 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకొని విజయవాడలో ఉండే అశోక్, ఎరుకమ్మను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు పంపారు. కేసును సత్వరమే ఛేదించిన కోదాడ పట్టణ సీఐ శివశంకర్, సీసీఎస్ ఎస్ఐ హరికృష్ణ, కోదాడ పట్టణ ఎస్ఐ హనుమా నాయక్, హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్, ఎస్కే ఎల్లారెడ్డి, జి.సతీష్, ఎం.వెంకటేశ్వర్లు, కె.రాంబాబు, ఎస్కే ఫరీద్, సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.