పెద్దవూర డిసెంబర్ 9 : మండలంలోని జయరాంతండాలో ఈనెల 4న ధాన్యం వ్యాపారి ఆత్మహత్యకు కారణమైన వారిని రిమాండ్‌కు పంపినట్లు నాగార్జునసాగర్ సీఐ కె. నాగరాజు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. పెద్దవూర మండలం జయరాంతండాకు చెందిన రమావత్ శ్రీను కొన్నేండ్లుగా ఫర్టిలైజర్, పురుగు మందుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అంతేకాకుండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నాడు. ఈనేపథ్యంలో తండాకు చెందిన రమావత్ లాలు శ్రీనుకు ధాన్యం అమ్మగా సకాలంలో డబ్బులు చెల్లించకపోడవంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.
లాలు ఆయన ఇద్దరి భార్యలు శ్రీను కుటుంబ సభ్యులపై చేయి చేసుకోడంతో తీవ్ర మనస్తాపనికి గురైన శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణమైన రమావత్ లాలు, ఆయన భార్యలు సునీత, పద్మ, అతడి తండ్రి రామ్‌సింగ్, తల్లి దర్జీని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట పెద్దవూర ఎస్ఐ పరమేశ్ ఉన్నారు.