సూర్యాపేట, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్, ఐపీఎస్‌లు మొదలుకొని ప్రతి శాఖలో ని ఉద్యోగులకు సంఘాలు ఉన్నాయి. అయితే రోజువారీ కూలీల కంటే అతి తక్కువ వేతనంతో పని చేస్తున్న వీవోఏలకు మాత్రం యూనియన్లు ఉండవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. శుక్రవా రం హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశానికి జిల్లాకు ఇద్దరు చొప్పున వీవోఏలు మాత్రమే రావాలని, ఏనాడూ సమ్మెలో పాల్గొనని వారై ఉండాలని, ఎలాంటి యూనియన్లలో సభ్యత్వం ఉండరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో విషయం తెలుసుకున్న వీవోఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హ యాంలో సమ్మెకు వెళ్లగా నాడు కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న సీతక్క టెంట్లలోకి జొరబడి మద్దతు ఇచ్చి, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. మీకు 18 నుంచి 20వేల వరకు జీతం ఇప్పి స్తాం.. అంటూ ఎన్నో హామీలు గుప్పించారు. అంతేకాదు ఎన్నికల హామీల్లో కూడా పెట్టారు. కానీ అదే సీతక్క నేడు మంత్రిగా ఉంటూ తమ ను అణచివేయాలని చూస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19న హైదరాబాద్ సెర్ప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సీఈవోతో సమావేశం నిర్వహిస్తున్నారు.
అయితే ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు(వీవోఏ)లు మాత్రమే రావాలని డీఆర్డీవో అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మీటింగ్‌లో వీవోఏలు చేసే పనులపై చర్చించి పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తమకు ఉన్నంత వర్క్ టెన్షన్ మరే ఉద్యోగికి ఉండదని, ఇచ్చే జీతం మాత్రం నెలకు రూ.5 వేలు మాత్రమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రకాల యాప్‌ల్లో ఎప్పుడు ఏ యాప్ ద్వారా ఎలాంటి సమాచారం పంపాల్సి వస్తుం దో తెలియదు.
ఇక ధాన్యం కొనుగోళ్లు, పుట్టిన వారి నుంచి మరణించే వారి సమాచారం సేకరించడం, చదువు రాని వారి బాధ్యత, ఎవరైనా అప్పులు తీసుకొని ఎగ్గొట్టినా వీరిదే బాధ్యత. ఏపీఎంలకు నచ్చకున్నా, సీసీలకు నచ్చకున్నా వీవోఏలకు ఇబ్బందులే.బ్యాంకు రుణాలు ఇప్పించడం, రికవరీలు గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకాన్ని ప్రొత్సహించడం, నర్సరీల బాధ్యత కూడా వీరిదే. ఇన్ని విధులు నిర్వర్తించే వీరు వేతనాలు పెంచాలి..రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి, ఐడీ కార్డులు ఇవ్వాలి, జీతాలు నేరుగా అక్కౌంట్లో వేయాలనే తదితర డిమాండ్లతో ఇటీవల కొద్ది రో జులు సమ్మెకు దిగారు.
దీంతో ప్రభుత్వం కొంతమందిని మచ్చిక చేసుకొని నమ్మించి ఎలాంటి హామీలు అమలు చేయకుండా మోసం చేసింది. పైగా వీఓఏలకు యూనియన్లు ఉండొద్దు… సమ్మెలకు దిగవద్దంటూ హుకుం జారీ చేసిందట. శుక్రవారం హైదరాబాద్ సెర్ఫ్ సీఈ వో మీటింగ్‌కు ప్రతి జిల్లా నుంచి ఇద్ద రు వీవోఏ ప్రతినిధులు మాత్రమే రావాలని సమ్మెలో పాల్గొనని వారు, ఎలాంటి సంఘాలతో సంబంధం లేని వారే రావాలంటూ నిబంధనలు విధించారు. దీంతో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల నుంచి మొదలు కుంటే ప్రతి ఒక్కరికి సం ఘాలు ఉన్నాయి మాకు మాత్రం ఎందుకు ఉండొద్దంటూ వీవోఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తమకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచడంతో పాటు అన్ని హక్కులు కల్పించాలని ప్రభు త్వన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేం సమ్మెకు దిగిన సమయంలో సీతక్క టెంట్ల వద్దకు వచ్చి తమకు వేతనం రూ.18 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీల్లో కూడా తమ వేతనంతో పాటు అనేక సమస్యలను పెట్టిన కాంగ్రెస్.. నేడు కనీసం నిరసనలు చేసుకునే అవకాశం కూడా కల్పించకపోవడం శోచనీయం. ఐదు వేల వేతనంతో బాగా పని చేయాలంటే ఎలా సాధ్యం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం పెంచాలి.
-వెంపటి గురూజీ, ఐకేపీ, వీవోఏ యూనియన్ సూర్యాపేట జిల్లా గౌరవాధ్యక్షుడు