నల్లగొండ, నవంబర్ 27: సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఎన్నికలు నిర్వహించే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని గ్రామాల్లో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తొలిరోజు రెండు జిల్లాల్లోని అభ్యర్థులు ఆయా క్లస్టర్లల్లో తమ నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండ జిల్లాలోని మొత్తం 14 మండలా ల్లో తొలి విడతగా 318 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనుండగా ఆయా గ్రామా ల్లో తొలి రోజు 421 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఆయా గ్రామా ల్లో 2870 వార్డులకు గాను 234 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం ఎనిమిది మండలాల్లో 159 గ్రామా ల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనుండగా ఆయా గ్రామాల్లో 207 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1442 వార్డులకు గాను 38 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆయా జిల్లాల్లో మూడు, నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన అధికారులు ఉదయం పది గంటల నుంచి సాయం త్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్లను ఈ నెల 29వరకు స్వీకరిస్తారు. అనంతరం నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ అనంతరం, వచ్చే నెల 3వ తేదీన ఉపసంహరణ ఉంటుం ది. అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వచ్చే నెల 11న మొదటి విడతకు సం బంధించిన ఎన్నికలు నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
యాదాద్రి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గం టల వరకు నామినేషన్లు స్వీకరించారు. యా దాద్రి భువనగిరి జిల్లాలో 427 పంచాయతీలు, 3704 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,32,240 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2,64,577 మంది పురుషులు, 2,67,661 మంది మహిళలు ఉన్నారు. తొలి విడతలో ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూ రు(ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి మం డలాల్లోని 153 పంచాయతీలు, 1286 వా ర్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తొలి విడతలో ఆరు మండలాల్లో 46 నామినేషన్ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్లతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, నో డ్యూస్, జనన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా నంబర్ జత చేయాల్సి ఉంటుందని అధికారులు సూ చించారు. జిల్లాలో తొలి రోజు సర్పంచ్ పదవులకు 205 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆలేరు మండలంలో 15, రాజాపేటలో 34, యాదగిరిగుట్టలో 31, ఆత్మకూరు(ఎం)లో 43, బొమ్మల రామారంలో 33, తుర్కపల్లిలో 49 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. 1286 వార్డులకు 134 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆలేరులో 9, రాజాపేటలో 21, యాదగిరిగుట్టలో 49, ఆత్మకూరు(ఎం)లో 14, బొమ్మలరామారంలో 7, తుర్కపల్లిలో 34 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటయ్యే వాటి వివరాలు ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న అప్పీళ్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 3, మధ్యా హ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 11న మొదటి విడత పోలింగ్ జరగనుంది.