నకిరేకల్, మార్చి 11 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ కేంద్రంలో మహిళలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. అనంతరం బండి సంజయ్‌పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ రాఘవరావుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పట్టణ కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు.
బండి డౌన్ డౌన్ అంటూ సంజయ్ ఫొటోను చెప్పులతో కొట్టి, దిష్టిబొమ్మ మెడలో చెప్పుల దండ వేసి దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.