కేతేపల్లి, ఆగస్టు 27 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని గుడివాడ గ్రామ శివారులో రూ.2.74 కోట్లతో నూతంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు, కేతేపల్లి నుంచి కాసనగోడు వరకు మూసీ కుడి కాల్వ వెంట రూ.1.17 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులు, బొప్పారం నుంచి కొర్లపహాడ్ వరకు రూ.1.44 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనుల శిలాఫలకాను ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని, నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలను రైతులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేశామన్నారు. ఈ సందర్భంగా కొర్లపహాడ్‌లోని టోల్‌ప్లాజా నుంచి భారీ బైక్‌ర్యాలీతో వచ్చి ఎమ్మెల్యే అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్దే విజయం : ఎమ్మెల్యే చిరుమర్తి
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఎదుర్కునే శక్తి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ఐదేండ్లుగా నియోజకవర్గంలో ప్రశాంతమై వాతావరణం నెలకొందని అన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడని పేర్కొన్నారు. వంద సీట్లతో బీఆర్ఎస్ రికార్డు సృష్టించబోతుందని తెలిపారు. సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి భారీ మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొప్పారంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్‌లు శ్రవణ్‌కుమార్, పూలమ్మ, ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, సర్పంచ్‌లు బి.శ్రీనివాస్‌యాదవ్, బచ్చు జానకీరాములు, జాల వెంకట్‌రెడ్డి, నాయకులు చల్లా కృష్ణారెడ్డి, బంటు మహేందర్, వెంకన్నయాదవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.