చివ్వేంల,ఫిబ్రవరి28 : ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును(Gold chain) దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి నారెడ్డి ధనమ్మ అనే మహిళ ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తన మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు.
మెడ నుంచి తాడును బలంగా లాగడంతో ధనమ్మకు గాయాలయ్యాయి. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు ధనమ్మ ఇంటికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాలతో ఉన్న ధనమ్మను స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.