సూర్యాపేట టౌన్, జూలై 4 : తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపా రు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని నాగయ్యగూడెం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న(60)కు పెద్ద కుమారుడు గంగ య్య, చిన్న కుమారుడు ఉప్పయ్య(మతిస్థిమి తం లేదు), కూతురు స్వరూప సంతానం.
నాగయ్యగూడెం గ్రామ శివారులో నిమ్మరబోయిన వెంకన్నకు 4.29 ఎకరాల భూమి ఉంది. అమ్మానాన్నకు ఒక ఎకరం, కుమారులకు చెరో ఎకరమున్నర, కూతురుకు 29 గుంటల వ్యవసాయ భూమి వాటాలు వేసి ఐదు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేసి ఒప్పంద పత్రం రాశారు. వీరికి ఈ భూమి పట్టా చేయలేదు. అప్పులున్నాయని తండ్రి వెంకన్న తన వాటాకు వచ్చిన ఎకరం భూమిని అమ్ముకున్నాడు. దీంతో కోపం పెంచుకున్న గంగయ్య తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.
గంగయ్య బైక్పై గొడ్డలి పెట్టుకొ ని తిరుగుతున్నాడు. ఈ నెల 2న మధ్యా హ్నం నిందితుడు తన బైక్పై మోతెకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తూ మోతె శివారులోని బంక్లో పెట్రోల్ పోయించుకున్నాడు. అదేసమయంలో వెంకన్న సూర్యాపేట నుంచి తన బైక్పై నాగయ్యగూడెం వెళ్లడాన్ని గమనించాడు. గుర్తు పట్టకుండా నిం దితుడు హెల్మెట్ ధరించి మోపెడ్ విభళాపురం గ్రామ శివారులో గొడ్డలితో వెంకన్నపై దాడి చేసి పారిపోయాడు. వెంకన్న తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని స్థానికులు మోతె పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని చికిత్స నిమిత్తం వెంకన్నను దవాఖానకు తరలించారు.
దవాఖానలో చికి త్స పొందుతూ వెంకన్న మరణించారు. మృతుడి కుమార్తె స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం మామిళ్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద నిందితుడు నిమ్మరబోయిన గంగయ్యను ఎస్ఐ యాదవేందర్రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో పని చేసిన మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ యాదవేందర్రెడ్డి, సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీలను అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీదర్రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్ఐ యాదవేందర్రెడ్డి, సిబ్బం ది ఉన్నారు.