యాదగిరిగుట్ట, జూలై 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. తిరుమాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, శివాలయం, శ్రీవారి మెట్ల మార్గంలో రద్దీ నెలకొంది. స్వామివారి ధర్శ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.