రామగిరి, ఫిబ్రవరి 18 : ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన రెండో విడుత దళిత బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని దళిత బంధు సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొరిలా మహేశ్ డిమాండ్ చేశారు. నల్లగొండలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా దళిత బంధు లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. దళిత బంధు రెండవ విడుతలో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చి నిధులు కేటాయించినా, ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఆగిపోయిందని గుర్తు చేశారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 1,050 మంది లబ్ధిదారులకు నిధులు అందాల్సి ఉన్నాయన్నారు. నేటికీ ఆ నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. హుజూరాబాద్, మధిర నియోజకవర్గాల్లో రెండు విడుత దళిత బంధు అమలు చేశారని, నల్లగొండ జిల్లాలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దళితుల పేర మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకారం అంబేద్కర్ అభయ హస్తం పేర ఇస్తామన్న రూ.12లక్షల పథకం ఏమైందని ప్రశ్నించారు. దళితుల కోసం ప్రకటించిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులంతా ఏకమై తగిన సమయం లో పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ నాయకు లు, అంబేద్కర్ భవన్ కన్వీనర్ బొర్ర సుధాకర్, బడుపుల శంకర్, కందుల లక్ష్మ య్య, అవుట రవీందర్, ఆదిమల్ల లింగయ్య, పేర్ల అశోక్, పెరిక యాదయ్య, ఈర్ల ప్రసాద్, కం దుల రమేశ్, పేరపాక నరసింహ పాల్గొన్నారు.