నీలగిరి, మే 26. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర చాలా కీలకమైందని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో లైసె న్స్ సర్వేయర్ల ధ్రువీకరణపత్రాల పరిశీలన, సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 28 నుంచి సుమారు 50 రోజులు(పని రోజులు) లైసెన్స్ సర్వేయర్లకు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించిన సర్వే ఎఫ్ లైన్ వంటి సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేకించి రెవెన్యూకు చెందిన గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారం కోసం నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలో మీసేవ ద్వారా 819 మంది దర ఖాస్తు చేసుకోగా మొదటి విడతగా 409 మంది ధ్రువీకరణ పత్రాలు పరిశీలించామ ని, ఆగస్టులో మరో 410 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో సర్వేల్యాం డ్ రికార్డ్స్ ఇన్చార్జి ఏడీ సుజాత, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు రమణయ్య, సూపరింటెండెంట్ రాధాకృష్ణ ఉన్నారు.
ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ ఇలాత్రిపాఠి కలెక్టరేట్లో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయాశాఖల అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణఅమిత్, రాజ్‌కుమార్, డీఆర్ఏ శ్రోత్రెడ్డి, డీఆరీవో శేఖర్‌రెడ్డి ఉన్నారు.