కట్టంగూర్, డిసెంబర్ 23 : పెండింగ్లో ఉన్న ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆశ వర్కర్లు కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు రూ.18 వేల కనీన వేతనం అందజేసి పీఎఫ్. ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆశ వర్కర్లతో పారితోషకం లేని పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత యూడు సంవత్సరాల నుండి ఆశ వర్కర్లతో చేయించుకున్న లెప్రసీ సర్వే బిల్లులు నేటికి ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సమన్వయ కమిటీ మండల కన్వీనర్ చెరుకు జానకి, ఆశ వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి భూపతి రేణుక, శ్రామిక మండల కన్వీనర్ ఆబ్బగోని సంతోశ్, సబ్ సెంటర్ల లీడర్లు, ఆశ వర్కర్లు అంతటి పద్మావతి, రేణుక, పద్మ, సైదమ్మ, శోభ, భారతి, సుజాత, సోషల్ మీడియా కన్వీనర్ గడగోజు సుజాత పాల్గొన్నారు.